Online Studies: పాఠ్య పుస్తకాల విషయంలో కొత్త విధానానికి ఏపీ విద్యా శాఖ బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే విధానాన్ని ఏపీ విద్యాశాఖ తీసుకొస్తోంది. వెబ్‌సైట్ నుంచి వెబ్ సైట్ నుండి ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వెబ్‌సైట్‌లో ఫ్రీ డౌన్‌లోడ్స్‌ను మంత్రి ప్రారంభించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం నిషేధమని మంత్రి చెప్పారు.
ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చే విధానం గురించి చెప్పారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. 4,84,197 మంది విద్యార్ధులు ఇంటర్ ఫస్టియర్, 5,19,793 మంది విద్యార్దులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది.
Read Also: AP Inter Results: ఇంటర్‌లో సత్తా చాటిన కృష్ణా జిల్లా.. మే నెలలోనే పది ఫలితాలు
ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని మంత్రి చెప్పారు. ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.