Site icon NTV Telugu

AP Rains Today: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు!

Telangana Ap Rains

Telangana Ap Rains

ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మన్యం-5, అల్లూరి-2, విజయనగరం-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. పలు ప్రాంతాల్లో పిడుగులు, గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్ల క్రింద, శిథిల గోడలు, భవనాల వద్ద ఉండొద్దని అధికారులు సూచించారు. ఏపీలో మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Exit mobile version