తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 10 వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ లో చదివేందుకు అప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు కూడా. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీటు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాలీసెట్ ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో వచ్చే ర్యాంకును బట్టి వివిధ కళాశాలలో విద్యార్థులకు సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఇక పాలిసెట్ లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతోంది. ఈ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకోగా ఎవరైనా చేసుకుని వారు ఉంటే నేరుగా పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిస్తే ఉచిత కోచింగ్ కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.
Also read: Janga Krishna Murthy: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల పెంపుకు లక్ష్యంగా పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కొరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఏప్రిల్ 25 వరకు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. 2023 – 24 విద్యా సంవత్సరం గాను పదవ తరగతి పరీక్షలు రాసిన వారు ఉచిత శిక్షణకు అర్హులని ఆవిడ తెలియజేశారు.
Also read: Tantra OTT: ఓటీటీలోకి రానున్న మరో హారర్ మూవీ తంత్ర.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?!
ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో మాత్రమే కాకుండా.. మొత్తంగా 87 ప్రభుత్వ పాలిటెక్నిక్, 182 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఉచిత శిక్షణ తరగతులు మొదలు కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలలో సిద్ధం చేసిన ఉచిత పాలీసెట్ కోచింగ్ మెటీరియల్ ని కోచింగ్ కు హాజరైన ప్రతి విద్యార్థికి అందిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా ప్రతిరోజు రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం పై క్లాసులో నిర్వహించబోతున్నారు. ఇక ఫ్రీ కోచింగ్ చివరి రోజు ఏప్రిల్ 25న ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా జరపబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చివరిగా ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది.