AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకే ఓటింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉండడంతో వారందిరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 4 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ భారీగా పెరగనుంది. మరో వైపు.. 47 చోట్ల అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరగనుంది. ఏపీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనేది తేల్చేందుకు ఎన్నికల సంఘం లెక్కలు తేలుస్తోంది.
Read Also: AP CEO MK Meena: పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తుది పోలింగ్ శాతం ఎంత అనే అంశంపై లెక్కలు తేల్చేందుకు ఈసీ నిమగ్నమైంది. తాజా లెక్కల ప్రకారం 80.05 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. విశాఖ, శ్రీకాకుళం, సత్యసాయి, మచిలీపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి , అనంతపురం జిల్లాలో ఆలస్యంగా పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.25 శాతంతో కలిపి మొత్తంగా ఇప్పటి వరకు 81.30 మేర పోలింగ్ నమోదైనట్లు సమాచారం. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఇంకాఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈ సాయంత్రానికి ఫైనల్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!