Site icon NTV Telugu

AP News: పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిన సీలింగ్‌.. ఎస్సైకు తృటిలో తప్పిన ప్రమాదం!

Tiruvuru Police Station

Tiruvuru Police Station

Tiruvuru Police Station: ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో పైకప్పునకు వేసిన సీలింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సెక్టార్‌-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్‌ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఎస్సై తెలిపారు.

Also Read: South Africa Cricket: రెండు ప్రపంచకప్‌ ఫైనల్స్‌లోనూ ఓటమే.. దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న దురదృష్టం!

దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో వర్షాలు పడినప్పుడు పైకప్పు లీకు అవుతుండేదని తిరువూరు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీలింగ్‌ పూర్తిగా తడిసి.. ఇప్పుడు కూలిపోయిందని చెబుతున్నారు. సీలింగ్‌ కూలిన సమయంలో ఎవరూ గదిలో లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version