Site icon NTV Telugu

Online Betting: ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటిన్నర పోగొట్టి.. పురుగుల మందు తాగిన వ్యక్తి!

Online Betting

Online Betting

ఆన్‌లైన్‌ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్‌ వ్యసనం భారీన పడిన ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. భూమి కొందామని దాచిన కోటిన్నర డబ్బును ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగ్‌ మాయలో పడి పోగొట్టాడు. డబ్బేదని కుటుంబ సభ్యులు అడగగా.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్యే దిక్కనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి…

రామన్నపాలెం గ్రామానికి చెందిన సూరిబాబు ఆన్‌లైన్‌ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్‌కు వ్యసనం అయ్యాడు. భూమి అమ్మగా వచ్చిన కోటి నలభై లక్షలను కుటుంబ సభ్యులు సూరిబాబు అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. మంచి రేటు వస్తుందని ఉమ్మడిగా ఉన్న భూమిని కుటుంబ సభ్యులు అమ్మారు. వేరే చోట భూమి కొందామని అందరూ అనుకున్నారు. అయితే ఇంట్లో అవసరాలు నిమిత్తం బ్యాంక్ నుంచి ఐదు లక్షలు తీసుకురావాలని కుటుంబ సభ్యులు సూరిబాబుకి చెప్పారు.

డబ్బులు మొత్తం ఆన్‌లైన్‌ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్‌లో పోగొట్టిన సూరిబాబుకు కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియరాలేదు. విషయం చెబితే ఏమంటారో అని భయపడ్డాడు. చివరకు ఆత్మహత్యే దిక్కని భావించాడు. సూరిబాబు పురుకోటిన్నర గుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులి వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. కోటిన్నర డబ్బు పోయినందుకు ఏడ్వాలో, సూరిబాబు బతికినందుకు సంతోషించాలో అనే స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు.

Exit mobile version