AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!

Ap Mptc, Zptc Elections 2026 Live Updates

Ap Mptc, Zptc Elections 2026 Live Updates

AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాకు ఏకగ్రీవం కాగా.. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2169 మంది జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2051 ఏకగ్రీవం కాగా.. 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్, జరుగుతుండగా, 18843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

  • 05 Nov 2026 07:23 AM (IST)

    పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!

    పల్నాడు జిల్లా గురజాల మండలంలో వైసీపీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురజాల మండలం పులిపాడు, దైద, తెలుకుట్ల, గంగవరం, చర్లగుడిపాడు జడ్పీటీసీ ఎన్నికల ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులు ఏజెంట్ ఫారాలు తీసుకొని చించి వేశారు.

  • 05 Nov 2026 07:22 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు!

    ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

  • 05 Nov 2026 07:16 AM (IST)

    2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం!

    9821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2051 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. బరిలో 18843 మంది అభ్యర్థులు ఉన్నారు.

  • 05 Nov 2026 07:13 AM (IST)

    77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం!

    ఏపీలో 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవం అయ్యాయి. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభం కాగా.. బరిలో 2169 మంది అభ్యర్థులు ఉన్నారు.

  • 05 Nov 2026 07:12 AM (IST)

    మొత్తం ఓటర్లు 2.61 కోట్లు!

    ఏపీలో మొత్తం ఓటర్లు 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు.

  • 05 Nov 2026 07:11 AM (IST)

    పోలింగ్ ప్రారంభం!

    ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 28 జిల్లా పరిషత్‌, 659 మండల పరిషత్‌లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.