Site icon NTV Telugu

MInister Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్‌ సవాల్.. అసెంబ్లీలోనైనా.. ఎక్కడైనా సరే..!

Minister Satyakumar Yadav

Minister Satyakumar Yadav

MInister Satya Kumar Yadav: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్‌ చేశారు.. ఇక, రాయచోటి వెనుకబడిన ప్రాంతమన్నారు.. మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతికి వెళ్లాల్సి ఉందన్నారు. రాయచోటి కి 23 కోట్ల 75 లక్షల నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ను మంజూరు చేసి నిర్మిస్తున్నామన్నారు. ట్రామ, సీవోపీడీ కేసులకు రాయచోటిలో చికిత్స అందేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.

Read Also: Hyderabad: డ్రైనేజీలో పడిపోయిన బాలిక.. తృటిలో తప్పిన ప్రమాదం

ఇక, రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ కేంద్రాలను గతంలో కేంద్రం మంజూరు చేసిందన్నారు మంత్రి సత్యకుమార్‌.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో అవన్నీ మూలనపడ్డాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు 20 క్రిటికల్ కేర్ కేంద్రాలను పూర్తి చేస్తామన్నామని వెల్లడించారు. క్యాన్సర్ మరణాలను తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. కర్నూలులో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ను పూర్తి చేశామన్నారు. అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ లను గాలికి వదిలేసారని వైఎస్‌ జగన్ అంటున్నారని మండిపడ్డారు.. వైద్యశాఖలో ఎక్కడా ఖాళీలు లేకుండా భర్తీలు చేస్తున్నామన్నారు.. కోటి 43 లక్షల కుటుంబాలకు 23 లక్షల వైద్య బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్.

Exit mobile version