Site icon NTV Telugu

Satya Kumar Yadav: పుష్ప-2 సినిమాపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Satya Kumar Yadav

Satya Kumar Yadav

పుష్ప-2 సినిమాపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలన చేసి, సావనిర్‌ను విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడారు. “వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీరి బయోపిక్ వల్ల ఏమి నేర్చుకోవాలి.. స్మగ్లర్ల పై కూడా సినిమాలు తీస్తున్నారు. ఐటెం సాంగ్స్ పెట్టి రూ.వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు.. తల్లిదండ్రులు కూడా ఓటీటిలో పుష్ప-2 చిత్రాన్ని చిన్నారులకు చూపిస్తున్నారు.. దీనివల్ల చిన్నారులకు ఏం నేర్పిస్తున్నారు. స్మగ్లర్లలా మారలనా? ఆదర్శవమైన వ్యక్తులపై బయోపిక్ చిత్రాలు రావాలి.” వ్యాఖ్యానించారు.

READ MORE: Maha Kumbh Mela 2025: చరిత్రలోనే అద్భుతం.. మహాకుంభమేళాలో రికార్డుల వర్షం

Exit mobile version