Site icon NTV Telugu

Nara Lokesh meets PM Modi: కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసి నారా లోకేష్‌.. 2 గంటల పాటు చర్చలు..

Lokesh

Lokesh

Nara Lokesh meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. సాయంత్రం హస్తినకు చేరుకున్నారు మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్.. ఇక, సాయంత్రం 7.30 గంటల తర్వాత ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు.. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకే ఢిల్లీకి వచ్చారు లోకేష్.. గతంలో విశాఖలో ఒకసారి , అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం సందర్భంగా మరోసారి కుటుంబ సమేతంగా వచ్చి తనను కలవాలని మంత్రి నారా లోకేష్‌కి సూచించారు ప్రధాని మోడీ.. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ అపాయింట్‌ను కోరారు.. లోకేష్‌.. ఆయన అనంతపురం జిల్లా పర్యటనలో ఉండగా ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో.. ఈ రోజు కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకుని.. ప్రధాని మోడీతో డిన్నర్‌ మీటింగ్‌ అయ్యారు నారా లోకేష్‌.. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల మందు నారా లోకేష్ చేసిన “యువ గళం” పాదయాత్ర స్వీయ అనుభవాలతో కూడిన పుస్తకాన్ని… ప్రధాని మోడీ ఆవిష్కరించారు.. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సుమారు రెండు గంటల పాటు కుటుంబ సమేతంగా గడిపారు ఏపీ మంత్రి నారా లోకేష్‌..

Read Also: Off The Record: ఎంపీ గడ్డం వంశీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ లో చర్చ! టచ్ మీ నాట్ వైఖరితో పెరుగుతున్న గ్యాప్

Exit mobile version