Site icon NTV Telugu

Minister Gottipati Ravi Kumar: ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్ గ్రేషియా సమాధానం కాదు.. ప్రమాదాల నివారణే టార్గెట్..!

Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

Minister Gottipati Ravi Kumar: జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు.. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. అయితే, ఏఐ ద్వారా ప్రమాదాలను తగ్గించే దిశగా కసరత్తులు చేయాలని.. ప్రతీ ఏడాదికి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు, ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని కోరారు..

Read Also: Mahesh Kumar Goud: వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అదే!

ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ప్రమాదాల నివారణకు డిస్కంలకు సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించారు మంత్రి గొట్టిపాటి.. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించడంతో పూర్తి స్థాయి ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందన్నారు.. విద్యుత్ ప్రమాదాల నివారణకు పక్క రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలి సూచించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌..

Exit mobile version