Andhrapradesh: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తల్లి సత్యనారాయణమ్మ(66) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు తెలిసింది. తాడేపల్లిలో ఉన్న మంత్రి దాడిశెట్టి రాజా తుని బయలుదేరారు. దాడిశెట్టి రాజా 19 జులై 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తుని మండలం, ఎస్. అన్నవరంలో శంకర్ రావు, సత్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. మంత్రి రాజా తల్లి సత్యనారాయణమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది.
Also Read:Central Jail: సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం.. ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు అరెస్ట్
