Site icon NTV Telugu

Ambati rambabu: పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికి రారు

Ambati Rambabu

Ambati Rambabu

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) విమర్శించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్ కేవలం తెలుగు దేశం (TDP) కోసమే జనసేన పార్టీని నడుపుతున్నారని తెలిపారు. నిన్నటి దాకా జనసేనకు మద్దతు తెలిపిన కాపులంతా ఆ పార్టీని వదిలి వైసీపీలో (YCP) చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కాపు నేత హరిరామ జోగయ్య వాళ్ల కుమారుడు కూడా సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీలో చేరారని గుర్తుచేశారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులంతా పవన్.. చంద్రబాబు (Chandrababu) చెంతకు చేరటంతో మోసపోయామని భావించారని.. పవర్ షేరింగ్ లేకుండా పోవడంతో కాపులు నిరాశకు గురయ్యారని తెలిపారు.

మార్చి 10న నాల్గో సిద్ధం సభతో టీడీపీ, జనసేన పని గోవిందేనన్నారు. సిద్ధానికి పోటీగా సభలు నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అని ప్రజలు ఆలోచించే తీరును గమనిస్తున్నామన్నారు. ఇంకా సీఎం జగన్‌ను ఎదుర్కొనే శక్తి టీడీపీ, జనసేనకు లేదని.. తాడేపల్లిగూడెం (Tadipalli Gudem) సభలో వాళ్ల జెండా ఎత్తేశారన్నారు. పవన్ మాట్లాడేది మొత్తం సినిమా డైలాగులేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ కావాలా.. ? 2019లో తుక్కు తుక్కుగా ఓడిన చంద్రబాబు కావాలా..? అని ప్రజలను అడిగితే.. ప్రలందరూ జగన్ పక్షానే ఉన్నారని తెలిపారు. 175 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version