AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!

Ap Mayor Elections 2026

Ap Mayor Elections 2026

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 21 తేదీల్లో రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 346 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఉపసంహరణల్లో అత్యధికంగా అక్టోబర్ 21న 345 నామినేషన్లను అభ్యర్థులు వెనక్కి తీసుకోగా.. అక్టోబర్ 20న ఒకే ఒక్క నామినేషన్ మాత్రమే ఉపసంహరించుకున్నారు.

13 మున్సిపల్ కార్పొరేషన్లలో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 294 నామినేషన్లు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో చిత్తూరులో ఎన్నికల పోటీ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు వైఎస్సార్ కడప కార్పొరేషన్ పరిధిలో ఒక్క నామినేషన్ కూడా ఉపసంహరించుకోలేదు. అక్కడ నామినేషన్ల ఉపసంహరణలు జరగకపోవడం ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధికంగా 121 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. వైసీపీ నుంచి 110, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 75 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. జనసేన పార్టీ నుంచి 19, కాంగ్రెస్ నుంచి 7, బీజేపీ నుంచి 6 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 1 నామినేషన్ ఉపసంహరణ జరిగింది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 5 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు.

పార్టీల వారీగా ఉపసంహరణల వివరాలు:
టీడీపీ: 121
వైసీపీ: 110
స్వతంత్ర అభ్యర్థులు: 75
జనసేన: 19
కాంగ్రెస్: 7
బీజేపీ: 6
సీపీఐ: 2
సీపీఎం: 1
ఇతర పార్టీలు: 5