Home Minister Taneti Vanitha: శుభవార్త చెప్పిన హోంమంత్రి.. త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ.

Taneti Vanitha

Taneti Vanitha

Home Minister Taneti Vanitha: పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తోన్నవారికి శుభవార్త చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాం.. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లటం వల్ల ఆ ప్రకియ ఆలస్యం అవుతుందన్నారు.. అయితే, త్వరలోనే మిగతా ప్రాసెస్ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

Read Also: Vishwak Sen vs Sai Rajesh:నో అంటే నో..అది మగాళ్ళకి కూడా.. బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు?

×
×
Ad

ఇక, ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించారని తెలిపారు హోంమంత్రి తానేటి వనిత.. గిరిజన యువకుడిపై అలాంటి ఘటన జరగటం దురుదృష్టకరమన్న ఆమె.. యువకుడిపై దాడి చేసిన ఇతర యువకులు గతంలో కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని.. ఓ మైనర్ బాలికపై అత్యాచార కేసులో జైలుకు కూడా వెళ్లారని వెల్లడించారు.. చోరీ సొమ్ము పంపకాల విషయంలోనే ఈ దాడి జరిగిందని.. దాడి సమయంలో ఏం జరిగిందో కూడా అర్థం కానీ మద్యం మత్తులో ఆ యువకుడు ఉన్నాడని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురిని ఇవాళ అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు హోంమంత్రి తానేటి వనిత. కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు యువకులు పైశాచికత్వగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ, నోట్లో మూత్రం పోసి చావబాదారు.. వదిలేయమని బతిమాలినా వినలేదు. అయితే, ఈ ఘటన మొత్తం ఓ మొబైల్‌లో చిత్రీకరించడంతో.. ఆలస్యంగా వెలుగు చూసిన విషయం విదితమే..