AP High Court: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది ఏపీ హైకోర్టు.. దీంతో.. రేపు సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠగా మారింది..
Read Also: Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య..అదిరిపోయిందంటూ ప్రశంసలు..
కాగా, రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా సంతకం ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దంటూ.. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించిన విషయం విదితమే.. అయితే, ఈ నిబంధనను అధికార వైసీపీ వ్యతిరేకించింది.. పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ.. బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకపోయినా.. ఓటును తిరస్కరించవద్దంటూ ఇచ్చిన మెమో సమంజసం కాదని.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించింది ఏపీ హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలను వింది.. చివరకు తీర్పును రిజర్వ్ చేసింది.. దీంతో.. రేపు సాయంత్రం 6 గంటలకు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది.
