NTV Telugu Site icon

AP High Court: ఆ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?.. అధికారులను ప్రశ్నించిన హైకోర్టు

Ap High Court

Ap High Court

AP High Court: విశాఖ సి.ఆర్.జెడ్ ప్రాంతంలో నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్టును వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీ.ఆర్.జెడ్ నిబధనలను ఉల్లంఘించి జరుపుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిపింది. వెంటనే నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్, విశాఖ జిల్లా కలెక్టర్ , భీమునిపట్నం తహశీల్దార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also: Nellore: నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పెంచిన పోలీసులు

సీ.ఆర్.జెడ్ వన్ ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. సముద్రానికి అతి సమీపంలో జరుపుతున్న శాశ్వత నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలని, దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది.