Site icon NTV Telugu

AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Ap High Court

Ap High Court

AP High Court: వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ.. 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.. ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పింది.. వాలంటీర్ల రాజీనామా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం.. అసలు ఎన్నికల కమిషన్‌కి ఏం సంబంధమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈసీ.. అయతే, రాష్ట్రంలోని 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేస్తే.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్‌ తమకి సంబంధలేదని అనటం సరికాదని హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్‌.. వేల సంఖ్యలో రాజీనామాలు ఎన్నికల సమయంలో జరిగితే దానిపై ఈసీ దృష్టి సారించింది చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రూల్స్ లో ఉందని వాదనలు వినిపించారు.. దీంతో, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

Read Also: CM YS Jagan: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తుంది..

కాగా, వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలు ఆమోదించవద్దని ఆదేశించాలంటూ.. బీసీ యువజనపార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ వస్తున్న విషయం విదితమే..

Exit mobile version