Site icon NTV Telugu

AP High Court: లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా నగదు జమ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

Ec

Ec

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్దిదారాల ఖాతాల్లో ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయటంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది… ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు వెసులుబాటు ఇస్తూ.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై డివిజన్ బెంచ్ లో విచారణ సాగింది.. అయితే, ఈ నెల 13న పోలింగ్ ఉన్న కారణంగా తర్వాత రోజున డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవాలనీ గతంలోనే ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆదేశాలను కొనసాగిస్తూ ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read Also: TSMS Inter Admissions: మోడల్ స్కూల్ ‘ఇంటర్’ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇలా..

ఇక, DBT ద్వారా నగదు జమ చేయటానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు కాగా.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇప్పుడు కేవలం నగదు ట్రాన్స్ ఫర్ చేయటం మాత్రమే చేస్తున్నాం.. ఇవన్నీ పాత పథకాలు తప్ప కొత్తవి కావన్నారు.. సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఈసీ మాకు క్లారిటీ ఇవ్వలేదన్నారు.. ఎన్నికల కమిషన్‌ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మేం ఇంకా నిధులు విడుదల చేయలేదని.. గతంలో 2019లో పసుపు కుంకుమ కోసం పోస్ట్ డిటెడ్ చెక్కులు ఇవ్వటం జరిగిందని గుర్తుచేశారు. కానీ, ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version