NTV Telugu Site icon

AP Highcourt: R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. హైకోర్ట్ కీలక ఉత్తర్వులు

High Court

High Court

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన 2 అనుబంధ పిటిషన్లు కొట్టివేసింది ఏపీ హైకోర్ట్. మెయిన్ పిటిషన్ పై విచారణ వేసవి సెలవుల తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో అమరావతి రైతులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం పేర్కొంది.

అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేయడంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయింది. పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు. ‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే.పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని సీజే పేర్కొన్నారు.

Read Also: Revanth Reddy: లక్ష్మణ్, కిషన్ రెడ్డి రండి.. మా మెట్లపై కూర్చొని చదువుదాం

R5 జోన్ లో పేదలకు ఇళ్ళ స్థలాల కేటాయింపు కోసం అధికారులు చర్యలు చేపట్టారు. జీఓ 45 ద్వారా CRDA నుంచి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు 1134.58 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.. పది లే అవుట్ల లో మొత్తం 45 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో 23 వేల మందికి ఐనవోలు, మందడం, కురగల్లు, నిడమర్రు లో ఇవ్వాలని నిర్ణయం జరిగింది. గుంటూరు జిల్లాలోని పేదలకు మందడం, కృష్ణాయ పాలెం, నవులురు, ఐనవోలు, నిడమర్రు లే అవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో అధికారులు ఇళ్ళ పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేస్తుండడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన మొత్తం లబ్దిదారులు 48379. గుంటూరు జిల్లా పరిధిలో 24152 మంది లబ్దిదారులు.ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 24587 మంది లబ్దిదారులు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1134.58 ఎకరాల కేటాయించింది ప్రభుత్వం.

Read Also:Most used apps: జనం మెచ్చిన యాప్‌లు. మార్చి నెలలో ఎక్కువగా డౌన్‌లోడ్ అయినవి..

Show comments