NTV Telugu Site icon

Nara Chandrababu: నారా చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. వైదొలిగిన న్యాయమూర్తి!

Chandrababu

Chandrababu

Judge withdraws from bail petition filed by Chandrababu Naidu: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్‌ దసరా పండగ సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) ముందు విచారణకు రాగా.. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని స్పష్టం చేశారు. ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్‌ నిర్ణయిస్తారని తెలిపారు.

విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలగడంతో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్‌ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. మరో జడ్జి ముందుకు నారా చంద్రబాబు పిటిషన్‌ వెళ్లనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. ఆ పిటిషన్‌ నేడు విచారణకు రాగా.. నాట్‌ బిఫోర్‌ మీ అంటూ న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకున్నారు.