NTV Telugu Site icon

High Court: జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయింపుపై అభ్యంతరం.. నేడు హైకోర్టులో విచారణ

High Court

High Court

High Court: జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై అభ్యంతరం తెలియజేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్.. జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ (ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించడాన్ని తన పిటిషన్‌లో తప్పుబట్టారు.. ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, హైదరాబాద్ లోని జనసేన పార్టీ అధ్యక్ష/కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్‌.. ఆ వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..

Read Also: Adudam Andhra: నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..

అయితే, గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా దరఖాస్తు చేశానని అంటున్నారు పిటిషనర్ . ఆర్‌పీసీ ధరఖాస్తు పట్టించుకోకుండా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, తమకే గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు పిటిషనర్‌.. అయితే, ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు ఎలాంటి విచారణ సాగనుంది.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి మరి.