Site icon NTV Telugu

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ.. కేసులు ఇవే..

Chandrababu Bail

Chandrababu Bail

AP High Court: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 52 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌ పొందారు.. తాజాగా ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ను కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. దీనిపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.. ఆ కేసు సంగతి అలా ఉంచితే మరికొన్ని కేసులు ఇప్పుడు చంద్రబాబును వెంటాడుతున్నాయి. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, ఫైబర్‌ నెట్‌ కేసు, ఇసుక కేసు ఇలా ఆయన చుట్టూ కేసులు ఉండగా.. ఇసుక స్కాం కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది..

Read Also: SBI Recruitment : డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 5వేలకు పైగా ఉద్యోగాలు.. నెలకు జీతం 60వేలు..

మరోవైపు, లిక్కర్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ సాగనుంది.. రెండు కేసుల్లో చంద్రబాబు, లిక్కర్‌ కేసులో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ రోజు హైకోర్టులో విచారణ జరపనుంది.. దీంతో, ఎలాంటి విచారణ సాగనుంది.. తీర్పు ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది. చంద్రబాబుపై పెట్టినవి అన్నీ తప్పుడు కేసులేనని టీడీపీ నేతులు విమర్శిస్తుండగా.. మరోవైపు.. చంద్రబాబుకు శిక్ష తప్పదంటున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. పలు అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికిపోయి.. బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబుకు జైలుశిక్ష పడడం తథ్యం అంటున్నారు. లేని వ్యాధులు తెచ్చుకుని చంద్రబాబు బెయిల్‌ తెచ్చుకున్నాడు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం, ఉన్న­దాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్ప­డం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడుతున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

Exit mobile version