Site icon NTV Telugu

SI Results: ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Si Results

Si Results

SI Results: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అభ్యర్థుల ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు.. రిక్రూట్ మెంట్ బోర్డ్ కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.. రిక్రూట్ మెంట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Read Also: Uttam Kumar Reddy: పార్టీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పా.. సీఎం పోస్ట్‌పై ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరోవైపు, 2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ న్యాయస్థానంకు అందించారు పిటిషనర్లు.. అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్ పునఃపరిశీలన చేసి వారంలో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. వరుసగా ముగ్గురు అభ్యర్థుల కొలతలు అర్హత పొందక పోవటంతో హైకోర్టు సీరియస్ అయ్యింది.. ఇటీవల ధ్రువీకరణ పత్రాలు జారీపై అవసరమైతే విచారణ చేస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే, ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది హైకోర్టు.. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

Exit mobile version