Chandrababu Bail: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. స్కిల్ కేసులో ఆగస్టు 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా ఆయన రిమాండ్‌లో ఉండగా.. అనారోగ్యకారణాల దృష్ట్యా.. అక్టోబర్ 31వ తేదీన చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. మధ్యంతర బెయిల్‌పై ఇప్పటికే ఆయన బయట ఉండగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు..
Read Also: Pat Cummins: మరోసారి ప్రేమలో పడ్డా.. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోను!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన వాదనలు ముగించింది కోర్టు.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. అయితే, ఈ రోజు చంద్రబాబుకు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.. ఈ నెల 28న రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించింది హైకోర్టు.. అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సీఐడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.