Site icon NTV Telugu

Angallu Rioting Case: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్‌

Chandrababu

Chandrababu

Angallu Rioting Case: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో కేసులో భారీ ఊరట లభించింది.. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది.. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అయితే, లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.. కాగా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు పోలీసులు. మొత్తం 179 మంది నేతలపై పోలీసులు కేటు పెట్టారు.. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు.. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్‌ వచ్చింది.. ఇప్పుడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు..

Exit mobile version