Site icon NTV Telugu

MP Mithun Reddy: ఎంపీ మిథున్‌రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు..

Mp Mithun Reddy

Mp Mithun Reddy

MP Mithun Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, గతంలో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే తిరస్కరించిందని.. అలాగే దాని అనంతరం దర్యాప్తులో స్పష్టత ఏర్పడిందని గతంలో సిట్‌ వాదనలు వినిపించిన విషయం విదితమే.. వీటితోపాటు మద్యం అక్రమ కార్యకలాపాల్లో వ్యూహ రచన అమలు మిథున్ రెడ్డిదే అని, ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని.. వేర్వేరు మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు రూ.5 కోట్ల మేర నిధులు చేరాయని గతంలో సిట్ తన కౌంటర్‌లో పేర్కొంది..

Read Also: Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!

కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్‌ రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్‌ అధికారులు.. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారు.. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్‌ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.. అయితే, ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్‌ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్‌ రెడ్డి.. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్‌ కాలేదన్నారు. అయితే, లిక్కర్‌ కేసులో ఎంపీ మిథున్‌ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఏపీలో మద్యం సరఫరాలో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని మాన్యువల్‌ మోడల్‌గా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.. మొతంగా ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించగా.. హైకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు.. అయితే, గతంలోనూ హైకోర్టులో మిథున్‌రెడ్డికి షాక్‌ తగిలిన విషయం విదితమే..

Exit mobile version