NTV Telugu Site icon

AP High Court: చంద్రబాబుకు హైకోర్టు షాక్‌.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌.

Babu

Babu

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది హైకోర్టు.. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబుకు షాక్‌ ఇస్తూ.. మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది హైకోర్టు.. దీంతో.. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. మరోవైపు.. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.. విజయవాడ ఏసీబీ కోర్టు కూడా బెయిల్‌ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది.. అలాగే సీఐడీ కస్టడీ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఉత్కంఠ వీడినా.. సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టుల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారంది.

Read Also: YSRCP: ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్.. వీవీఐపీ గ్యాలరీల్లో మంత్రులు..

Show comments