NTV Telugu Site icon

AP High Court: నలుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు వారెంట్లు.. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లును ఏపీ హైకోర్టు జారీ చేసింది.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలన్న ఆదేశాలు పాటించకపోవడంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు పేర్కొంది.. ఐఏఎస్ అధికారులు శశి భూషణ్, రావత్, కృతి శుక్లా, హిమాన్ష్ శుక్లాలకు ఈ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, వారెంట్లు అమలుకు వీలుగా విచారణ నవబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.. ఇక, ఆ నలుగురు ఐఏఎస్‌ అధికారులకు బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు.. నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

Read Also: Polavaram Irrigation Project: పోలవరం నిర్మాణంపై నేడు, రేపు సమీక్షలు.. ఆ తర్వాత సీఎంతో భేటీ..