Site icon NTV Telugu

AP High Court: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

Ap Hc

Ap Hc

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు.. సీఐడీ న్యాయవాదులు సమయం కోరడంతో.. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. అయితే, ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది.. దీంతో.. హైకోర్టును ఆశ్రయించారు న్యాయవాదులు.. ప్రధాన పిటిషన్‌పై తేలే వరకు మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వాలని తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది కాబట్టి.. ఏపీ హైకోర్టు స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని కూడా ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తే.. సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదిస్తూ వస్తున్నారు సీఐడీ తరపు న్యాయవాదులు.. విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడడంతో.. అప్పుడు ఎలాంటి వాదనలు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version