NTV Telugu Site icon

AP Health Minister: వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి..

Satya Kumar

Satya Kumar

AP Health Minister: అధిక వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రజ‌ల ఆరోగ్య ప‌ట్ల అధికారులు అప్రమ‌త్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రికొద్ది రోజులు కొన‌సాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజ‌ల ఆరోగ్యం ప‌ట్ల వివిధ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమ‌త్తంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆదేశించారు. అమెరికాలో ఉన్న మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎం.టి.కృష్ణబాబు, ఇత‌ర అధికారుల‌తో ప‌రిస్థితిని స‌మీక్షించారు. క్షేత్రస్థాయి వైద్యఆరోగ్య అధికారులు ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తూ ప్రజ‌ల‌కు త‌గు సూచ‌న‌లు, సాయం అందేలా చూడాలన్నారు. భారీగా వ‌ర్షాలు కురుస్తున్నందున గ్రామాలు, ప‌ట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండ‌కుండా సంబంధిత శాఖ‌ల‌తో ఆరోగ్య శాఖాధికారులు స‌మ‌న్వయం చేసుకోవాలన్నారు.

Read Also: Home Minister Anitha: భారీ వర్షాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

గుంటూరు, రంగ‌రాయ‌, సిద్దార్ధ ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక స‌మావేశంలో కీల‌కోపాన్యాసం చేయ‌డానికి నిర్వాహ‌కుల ఆహ్వానంపై మంత్రి అమెరికాలోని ఆర్లెండో చేరుకున్నారు. స్థానిక కాల‌మానం ప్రకారం సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ సాయంత్రం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల పూర్వ విద్యార్థులు, ఇత‌రుల‌నుద్దేశించి రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య రంగంలో కొత్తగా రానున్న పెట్టుబ‌డుల అవ‌కాశాల్ని మంత్రి ఈ సంద‌ర్భంగా వివ‌రించ‌నున్నారు.