Site icon NTV Telugu

AP Group 2: గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!

Ap High Court

Ap High Court

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.

Also Read: Anil Ravipudi-Chiranjeevi: చిరుని చూసి.. చరణ్‌కు తమ్ముడా అని అడుగుతున్నారు!

గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దు చేయాలని 2023లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్‌ పాయింట్లను సవాలు చేస్తూ.. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్‌ రోస్టర్‌ పాటించాలని పిటిషన్లు దాఖలు చేశారు. పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థులు కోరారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పిటిషన్లను కొట్టివేసింది.

Exit mobile version