Site icon NTV Telugu

Group 1 Exams 2025: రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే!

Ap Group 1 Exams 2025

Ap Group 1 Exams 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్‌ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో పదమూడు పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. విశాఖలో 2, విజయవాడలో 6, తిరుతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 15 నిమిషాల అదనపు అవకాశంతో 9:45 వరకూ పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్, గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు.

Also Read: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

పరీక్షల షెడ్యూల్‌ ఇదే:
మే 3 -తెలుగు పేపర్‌ (అర్హత పరీక్ష)
మే 4-ఇంగ్లిష్‌ పేపర్‌ (అర్హత పరీక్ష)
మే 5-పేపర్‌–1 – జనరల్‌ ఎస్సే
మే 6-పేపర్‌–2 – భారత, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు
మే 7-పేపర్‌–3 – రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతిశాస్త్రం
మే 8-పేపర్‌–4 – భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
మే 9-పేపర్‌–5 – సైన్స్, టెక్నాలజీ అండ్‌ పర్యావరణ అంశాలు

Exit mobile version