Nara Lokesh: ఏపీలో ఉద్యోగల జాతర.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు..!

  • ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు
  • మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
  • ఇప్పటివరకు కల్పించిన ఉద్యోగాలను ట్రాక్ చేయాలని ఆదేశాలు
  • ఆధార్/KYC ద్వారా ప్రతి ఉద్యోగాన్ని అనుసంధానం చేసే నిర్ణయం
  • 787 కంపెనీలతో కుదుర్చుకున్న MoUs పురోగతిపై పర్యవేక్షణ
  • పెట్టుబడులు గ్రౌండ్ స్థాయిలో అమలు అయ్యేలా చర్యలు.
Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటివరకు కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నైపుణ్యం (Skill) పోర్టల్ తరహాలోనే, ప్రతి ఉద్యోగాన్ని ఆధార్ లేదా కేవైసీ (KYC) తో అనుసంధానం చేసి ట్రాక్ చేయాలని నిర్ణయించారు. తద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా.. ఎంతమందికి ఉపాధి లభించిందనే అంశంపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

HYDRA : రూ.1200 కోట్ల భూమిపై కాపాడిన హైడ్రా.. ఖానామెట్‌లో అక్రమాలకు ఫుల్ స్టాప్.!

ప్రభుత్వంతో ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్న 787 కంపెనీల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా (Grounding) అధికారులు కృషి చేయాలని లోకేష్ సూచించారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింగపూర్, దుబాయ్ కంటే సులభతరమైన విధానాలను (Ease of Doing Business) అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల ద్వారా ఇప్పటివరకు సుమారు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. చిన్న పరిశ్రమలైనా, భారీ పెట్టుబడులైనా తమకు సమానమేనని, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని మంత్రులు పేర్కొన్నారు.

Jagital : గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృ*తి

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (EDB)ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శాఖలో ఈడీబీ ట్రాకర్‌ను పర్యవేక్షించేందుకు ఒక ‘సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ (SPOC) ను నామినేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన ఎన్వోసీలు (NOCs), అనుమతుల గడువును ట్రాక్ చేసేలా ఒక పటిష్టమైన వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని, నిరంతర పర్యవేక్షణ ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది.