టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీ చరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే.
Also Read: Ambati Rambabu: కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం.. అంబటి ఆసక్తికర కామెంట్స్!
క్రికెటర్ శ్రీ చరణి ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు అనిత, సంధ్యా రాణి, సవిత.. ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని, మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లిన శ్రీ చరణి.. అక్కడ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీ చరణిని సీఎం అభినందించారు. మెగా టోర్నీ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎంతో పంచుకున్నారు. ఆపై మంగళగిరి స్టేడియంలో మీడియాతో మాట్లాడారు.
