Site icon NTV Telugu

AP Govt: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Ap Govt

Ap Govt

AP Govt: గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉద్యాన వన పంటలు సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు ఈ నిధులను రిలీజ్ చేసింది. 4.82 కోట్ల రూపాయల నిధులను విడుదలకు పరిపాలన పరమైన ఆదేశాలను రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. మే 2024లో ఉద్యాన వన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ 4.31 కోట్లు మంజూరు చేసింది. ఇక, పంట నష్టపోయిన 2,856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

అయితే, అక్టోబర్ 2024లో ఉద్యాన వన పంటలు దెబ్బ తిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 50 లక్షల 16 వేల రూపాయలను మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. పంట నష్టపోయిన 501 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఉద్యాన వన శాఖ డైరెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ. జయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version