Site icon NTV Telugu

Trainee Police Constables Stipend: ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శుభవార్త.. ఉపకార వేతనం రూ.12,000కు పెంపు

Ap Police

Ap Police

Trainee Police Constables Stipend: స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPCలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం నెలవారీగా అందుతున్న రూ.4,500 ఉపకార వేతనాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల శిక్షణలో ఉన్న వేలాది క్యాడెట్ ట్రైనీలకు ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది.

Dulquer Salmaan: తెలుగులో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..?

ఉపకార వేతనం పెంపునకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. పోలీస్ శిక్షణ సమయంలో ఎదురయ్యే ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేతనం పెంపు అమలుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Air India Express PayDay Sale: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేడే సేల్‌.. రూ.1,950 ఫ్లైట్ టిక్కెట్

Exit mobile version