రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తనకు వ్యూహం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు అన్నారు. తమకు మెజారిటీ ఉందని, మూడు రాజ్యసభ స్థానాలు తమకే వస్తాయని ప్రసాద్ రాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అడ్డదారులు తొక్కాలని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం అడిగే ఏ అంశంపై అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు చెప్పారు. ఆదివారం ‘ఎన్టీవీ’తో చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడారు.
‘ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. బీఏసీలో సమావేశాల అజెండా ఉంటుంది. ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ప్రతిపక్షం అడిగే ఏ అంశంపై అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూడు నెలలకు చెందిన ప్రతిపాదనలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరోసారి ప్రజలకు వివరించటానికి ఈ వేదికను ఉపయోగించుకుంటాం’ అని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు తెలిపారు.
Also Read: Ramachandra Reddy: ఎన్నికల సమయంలో ఇదంతా సహజమే.. వేమిరెడ్డి అసంతృప్తిపై పెద్దిరెడ్డి!
‘వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై పిటిషనర్‌గా నాకు వచ్చిన నోటీసులపై లిఖితపూర్వకంగా స్పీకర్‌కు వివరణ ఇచ్చాను. 8వ తేదీన హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. త్వరలోనే స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకుంటారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మాకు వ్యూహం ఉంది. మాకు మంచి మెజారిటీ ఉంది. మూడు రాజ్యసభ స్థానాలు మాకే వస్తాయి. టీడీపీ అడ్డదారులు తొక్కాలని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూస్తోంది’ అని ప్రసాద్ రాజు చెప్పారు.