Site icon NTV Telugu

AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!

Wine Shops Ap

Wine Shops Ap

2026 నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అనుమతుల ప్రకారం.. డిసెంబర్ 31 మరియు జనవరి 1 రాత్రుల్లో A4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయించవచ్చు.

Also Read: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ!

అలాగే 2B బార్లు, C1 (ఇన్-హౌస్), EP1 (ఈవెంట్ పర్మిట్), TD1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సర్వీస్‌కు అనుమతి ఇచ్చారు. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలు చేసిన విధానాన్నే ఈ ఏడాదీ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version