Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ, 2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని, తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియనివారే తమ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పటివరకు 14 డీఎస్సీల ద్వారా 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 350కి పైగా పిటిషన్లు వేసి నియామకాలను అడ్డుకోవాలని చూసినప్పటికీ, అన్నింటినీ దాటుకుని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. టెక్నాలజీ, ఐటీ, ఏఐ విప్లవం ఎంత పెరిగినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సున్నితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని కోరారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగానే నూతన విద్యా విధానం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
ఈ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీపి కబురు అందిస్తూ 12వ పీఆర్సీ (PRC) నియామకానికి ఆమోదం తెలిపారు. వచ్చే అక్టోబరు నుంచి రెండు డీఏలను మంజూరు చేయడంతో పాటు, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్‌లను సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు పోలీసులకు దసరా కానుకగా అదనపు సరెండర్ లీవ్, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్‌ను 10 నుంచి 15 శాతానికి పెంపు, ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ నిధులను ప్రతినెలా జమ చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో సభలో ఉన్న ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!