NTV Telugu Site icon

AP Governor Abdul Nazeer : 2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్

Syed Abdul Nazeer

Syed Abdul Nazeer

AP Governor Abdul Nazeer : భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని ఆయన వ్యవసాయ యూనివర్శిటీనిసందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న 2030కల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని, ఇందులో చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచటమే ప్రధానమన్నారు. వాతావరణ మార్పులు ఇబ్బంది ఉన్నా.. చిరు ధాన్యాల సాగులో మంచి దిగుబడి వస్తుందన్నారు. చిరు ధాన్యాల్లో నూతన వంగడాలు ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మిల్లెట్ల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. వాటిని తినడం వలన మనుషులు ఆరోగ్యకరం గా ఉంటారు.

Read Also:Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి

వ్యవసాయంలో 17 రకాల నూతన వంగడాలను 2021లో ఆవిష్కరించటం శుభ పరిణామమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. శాస్త్రవేత్తలు రైతులతో నిత్యం అనుసంధానం కావటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. డ్రోన్ శిక్షణలో డిజిసిఏ అనుమతి సాధించిన వ్యవసాయ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. వ్యవసాయం మాత్రమే అన్ని వేలలా సంపద సృష్టికి తోడ్పటుతుందని, వ్యవసాయ విద్యలో మరిన్ని మార్పులు రావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. క్షేత్ర పర్యటనలు, సాంకేతికత వినియోగం, సరికొత్త ఆలోచనలు పెంపొందించేలా విద్య ఉండాలన్నారు. విద్యార్థులు వేరొకరి దయ మీద ఆధారపడకుండా పట్టుదలతో విజయం సాధించాలన్నారు. జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని.. ‘మీ కలల్ని సాధించడం మీతోనే సాధ్యం.. మీ లక్ష్యం చేరుకునేందుకు మీరు మాత్రమే కృషి చేయాల్సి ఉంటుంది’ అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సాధించాలన్న తపన ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా విజయం సాధించి తీరుతారన్నారు.

Read Also:Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్

Show comments