NTV Telugu Site icon

AP Capital Construction: రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.

Capital

Capital

AP Capital Construction: రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని డిసైడ్ అయింది. రాజధానిలో నిర్మాణాల స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐకానిక్ కట్టడాలు సహా ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఎన్జీవోల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఐకానిక్ కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలను ఐఐటీ చెన్నైకు అప్పగించాలని నిర్ణయించారు. 80 శాతం మేర నిర్మాణం పూర్తైన ఇతర నివాస సముదాయాలు.. గత ఐదేళ్లుగా పూర్తిగా నీటిలో మునిగిపోయిన ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్టతను ఐఐటీ సంస్థలు నిర్ధారించనున్నాయి. ఇక, ఐఐటీ సర్టిఫికెషన్ వచ్చాకే పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో..కట్టడాల నిర్మాణాలు మొదలు కావడానికి మరో ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో రాజధాని ప్రాంతంలో పర్యటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన కట్టడాలను పరిశీలించారు.. ఏ ఏ కట్టడం ఏ మేర పూర్తి అయ్యిందనే విషయాలపై ఆరా తీశారు.. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై వివరాలు వెల్లడించిన విషయం విదితమే.