AP Govt: బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేపు సెక్రటేరీయేట్‌లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. రేపు మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ఎనిమిది మంది బీసీ మంత్రుల సమావేశం జరగనుందని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల రక్షణకు చట్టం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. బీసీ డిక్లరేషన్ లోనూ మంత్రి నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
Read Also: AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు