NTV Telugu Site icon

Vizag Erra Matti Dibbalu: విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలు..

Erra Matti Dibbalu

Erra Matti Dibbalu

Vizag Erra Matti Dibbalu: విశాఖ తీరంలో భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి కొండలు రియల్ ఎస్టేట్ లే అవుట్ గా మారిపోతున్నాయి. సర్వే నెంబర్ 118/5లో అక్రమ తవ్వకాలు వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది.. అయితే, పర్యావరణ విధ్వంసం పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. GVMC టౌన్ ప్లానింగ్ విభాగం అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు, గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GVMC) నుంచి పొందిన అనుమతులను ఉల్లంఘించి.. కొండలను కొల్లగొడుతున్నట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు అధికారులు.. ఇక, ప్రభుత్వ ఆదేశాలతో వివాదాస్పద తవ్వకాలను పరిశీలించారు జాయింట్‌ కలెక్టర్‌ మయూర్ అశోక్.. మొత్తంగా అనుమతులను ఉల్లంఘించి కొండలను కొల్లగొడుతున్నట్టు అధికారులు గుర్తించారు.. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చడంతో.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది..

Read Also: CM Revanth Reddy: కుక్కలలో దాడి బాలుడు మృతి ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన సీఎం..

Show comments