NTV Telugu Site icon

TTD Employees: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. సీఎం జగన్‌ చేతుల మీదుగా పట్టాలు

Ttd

Ttd

TTD Employees: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం చేయనున్నారు.. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ నెల 18వ తేదీన తిరుమలలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేయనున్నారు.. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే కాగా.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణకు విచ్చేయనున్న సీఎం జగన్‌.. టీటీడీ ఉద్యోగులుకు ఈస్థలాలు పంపిణీ చేయబోతున్నారు.. ఇక, శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు 17వ తేదీన అంకురార్పణ జ‌రుగ‌నుంది. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు..

Read Also: Malaika Arora: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న బోల్డ్ బ్యూటీ..

ఈ నెల 17న శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. 18న బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహ‌ణం..పెద్దశేష వాహ‌న సేవ నిర్వహిస్తారు.. 19న చిన్నశేష వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం. హంస వాహ‌న సేవ.. 20న సింహ వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం.. ముత్యపుపందిరి వాహ‌న సేవ.. 21న క‌ల్పవృక్ష వాహ‌నం, స‌ర్వభూపాల‌ వాహ‌న సేవ నిర్వహిస్తారు.. 22న మోహినీ అవ‌తారం.. గ‌రుడ‌సేవ‌.. 23న హ‌నుమంత వాహ‌నం, స్వర్ణర‌థం.. గ‌జ వాహ‌న సేవ.. 24న సూర్యప్రభ వాహ‌నం, స్నప‌న‌తిరుమంజ‌నం, చంద్రప్రభ వాహ‌న సేవ ఉంటుంది.. ఇక, 25న, ర‌థోత్సవం, అశ్వ వాహ‌న సేవ.. 26న ప‌ల్లకీ ఉత్సవం మ‌రియు తిరుచ్చి ఉత్సవం.. స్నప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్రస్నానం.. ధ్వజావ‌రోహ‌ణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.