Site icon NTV Telugu

Chandrababu Arrest: చంద్రబాబుకు మరో షాక్.. మాజీ పీఎస్‌పై సస్పెన్షన్‌ వేటు..

Srinivas

Srinivas

Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్‌ సెక్రటరీ (పీఎస్) పెండ్యాల శ్రీనివాస్‌పై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు శ్రీనివాన్‌ను సస్పెండ్‌ చేసింది.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు శ్రీనివాస్.. ఏ పీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో కీలకంగా శ్రీనివాస్ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరినట్టు సీఐడీ అభియోగాలు మోపింది.. దీంతో.. శ్రీనివాస్‌పై చర్యలకు పూనుకుంది.. అయితే, ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రస్తుతం శ్రీనివాస్‌ అమెరికా పారిపోయినట్టు తెలుస్తోంది.

Read Also: Esha Gupta: కాస్టింగ్ కౌచ్ వల్ల తాను పడ్డ భాధలను గుర్తుచేసుకున్న ఈషా గుప్తా..

కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. 21వ రోజుకు చేరింది రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్.. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్‌ చేసింది ఏపీ సీఐడీ.. నేడు చంద్రబాబుకు మద్దతుగా రాత్రి 7 నుండి 5 నిమిషాలు పాటు మోత మోగిద్దాం అంటూ ఆందోళనకు టీడీపీ శ్రేణులకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.. చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం అని కోరారు బ్రాహ్మణి.. ఇక, టీడీపీ పిలుపునకు వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు.

Exit mobile version