NTV Telugu Site icon

AP Government: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కాలేజీల వద్దే ఉన్న సర్టిఫికెట్లు ఇప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు..

Lokesh

Lokesh

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది.. వివిధ కారణాలతో కాలేజీల వద్దే ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.. మొత్తం ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయోనని మంత్రి నారా లోకేష్‌ ఆరా తీస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. అయితే, 8 లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేస్తోంది సర్కార్.. పెండింగ్‌లో ఉన్న రూ. 3500 కోట్ల మేర విద్యా దీవెన సొమ్మును చెల్లించేలా ప్లాన్‌ చేస్తున్నారు.. అయితే, గత ప్రభుత్వం విద్యా దీవెన చెల్లింపులు పెండింగులో పెట్టడంతో సర్టిఫికెట్లను ఆయా కాలేజీలు.. వారి దగ్గర పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నారట మంత్రి నారా లోకేష్. మొత్తంగా ఆరు విడతల్లో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

Read Also: Stampede in Air India Recruitment Drive: మొన్న గుజరాత్‌.. నేడు ముంబై.. రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో తొక్కిస‌లాట..

కాగా, ఫీజు సంబంధిత వ్యవహారాలతో చాలా కాలేజీలు విద్యార్థుల చదువులు పూర్తి అయినా.. వారి సర్టిఫికెట్లను మాత్రం కొన్ని కాలేజీలు వాటి దగ్గర పెట్టుకుంటున్నాయి.. దీంతో.. విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా.. ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు వెళ్లాల్సిన ఇచ్చినా.. వారికి ఇబ్బందిగా మారుతుంది.. ఇక, విద్యార్థుల సమస్యలపై ఫోకస్ పెట్టిన మంత్రి నారా లోకేష్.. వారికి సంబంధిచిన సర్టిఫికెట్లు విద్యార్ధులకు ఇప్పించడంపై ఫోకస్ పెడుతున్నారు.