NTV Telugu Site icon

Kakinada Port PDS Rice: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

Sit

Sit

Kakinada Port PDS Rice: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమా‌మహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్‌ను ఏర్పాటు చేసింది.పీడీఎస్ రైస్ ఎగుమతిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా సిట్ విచారణ జరపనుంది. సిట్ నివేదికను ప్రతీ పదిహేను రోజులకు ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా విచారణ జరగనుంది.

Read Also: Minister Narayana: నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తాం..

పీడీఎస్ రైస్ రవాణా జరిగిన విధానంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై సిట్ పూర్తి విచారణ చేయనుంది. పీడీఎస్ రైస్‌ను ఎక్సపోర్ట్ డాక్యుమెంట్లలో ఎలా నివేదించారో సిట్ వెలికితీయనుంది. దోషులుగా తేలితే వెంటనే అరెస్టు చేసేందుకు సిట్‌కు పూర్తి అధికారం ఉంది. సాక్షులను, సంబంధిత డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి అవసరమైతే సీజ్ చేసేందుకు సిట్‌కు అధికారాలను కల్పించింది ఏపీ ప్రభుత్వం.