Site icon NTV Telugu

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం

Chandrababu

Chandrababu

Chandrababu: అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ నెల 29వ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై బయటికి వచ్చారు.

Exit mobile version