NTV Telugu Site icon

AP Govt: టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

Kotamreddy

Kotamreddy

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఏకంగా పార్టీ అధిష్ఠానంపై ఆయన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం లేదని ఆయన అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజం కాదనే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ… వైసీపీలో ఉండటం ఇష్టం లేకపోతే కోటంరెడ్డి పార్టీని వీడి పోవచ్చని చెప్పారు. కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ట్యాప్ చేసింది కాదని… అది రికార్డ్ చేసిందని అన్నారు. అది రికార్డ్ చేసిన ఆడియో అని నిరూపితమైతే కోటంరెడ్డి రాజకీయాలను వదిలేయాలని సవాల్ విసిరారు. వాస్తవాలను నిరూపించడానికి కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పారు.

AP CM Jaganmohan Reddy: విద్యాశాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

ఈ నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అంటూ మంత్రులు చెబుతుండగా.. నిగ్గు తేల్చేందుకు రంగంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు దిగారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలను సేకరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశం ఇంది. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు.

Show comments